Monday, May 17, 2010

మాటలతో పంచుకునే స్నేహం మనది

మాటలతో పంచుకునే స్నేహం మనది
ప్రేమతో పిలుచుకొనే బందం ఇది..
ఇద్దరికే సొంతమయె స్నేహం ఇది
ఇంకెవరు చెప్పలేని భావం ఇది..
నీవెక్కడని,నీవెవరు అని అడగని మన స్నేహంలో నీకెందుకని,
నే చెప్పనని దాచని మన బందంలో ఎంత చిన్నదో ఈ లోకమన్నది.

మాట్లాడకు అన్నంత మాత్రాన మరిచి పోతానని అనుకున్నావా ...

మాట్లాడకు అన్నంత మాత్రాన
మరిచి పోతానని అనుకున్నావా ...
మరు జన్మకై నేను వేచి యున్నాను.
మిగిలిన ఈ రోజులు మ్రింగ లేకున్నాను.
ముచ్చటైన మన కలయిక మరువలేకున్నాను..
నేను నిన్ను మరువలేను.
మరువలేని నేస్తమా
జన్మల బంధానికి ఎదురు చూపు తప్పదమ్మా
మాటలే లేనప్పుడు మౌనమే భాషా
అందుకే ఈ మౌనం అంటున్నా
కాదనలేవు గా మధుర బంధమా

ఉదయించిన ఈ రోజు ప్రతి రోజులా లేదు

ఉదయించిన ఈ రోజు ప్రతి రోజులా లేదు

ఎందుకంటే నీ చిట్టిపాదాలు భూమిపై అడుగిడిన రోజు

నాకోసం ఒక స్నేహితున్ని అందించినరోజు....

అందుకో చిట్టిపాపాయిలా నీ ప్రియనేస్తం అందించే శుభాకాంక్షలు...

నీ పెదాలపైనా చిరునవ్వు పూయిస్తూ చిరకాలం నవ్విస్తూ..

జన్మదిన శుభాకాంక్షలు...!!

సెలఏటి గలగలలో ...సాగే నండూరి ఎంకి పాటలా..

సెలఏటి గలగలలో ...సాగే నండూరి ఎంకి పాటలా...
జల జల జాలువారే జలపాతాల జోరులా....
నాలో కదలాడే నీ భావనా తరంగాల సరిగమలు...
వేయి జన్మలకైనా నీవు నాతోనే వుంటావు అన్న ఊహతో.....
నీ రాకకై ఎదురుచూస్తూ వుంటాను నేస్తం.....

చిక్కుబడిన జుట్టుని

చిక్కుబడిన జుట్టుని
అద్దం ముందు విడదీస్తోంది అమ్మాయి
‘నువ్వొట్టి అనాకారివి’ అంది అద్దం

అమ్మాయి చిన్నగా
నవ్వుకుంది
ఆ రోజ ఉదయమే
రోడ్డుదాటించాక
‘నువ్వెంత అందమైనదానవో’
అన్న గుడ్డిపిల్లాడి మాటల గుర్తొచ్చి

తుషారపు జల్లులు కావవి

తుషారపు జల్లులు కావవి మంచి ముత్యపు చినుకులు
మంచుదిబ్బల్లు కావవి మలచని పరుపు దొంతరలు
పిల్లగాలిపిలుపులు కావవి గండుకోయిలల పలుకులు
నీలిమబ్బువిరుపులు కావవి నింగిన మెరిసిన తారకలు
పక్షుల కిలకిలరవములు కావవి పసిపాప నవ్వుల కేరింతలు
పచ్చని పసిరికలు కావవి తడిసిన పసిడివన్నెల కాంతులు
మదినూహించినవి కావివి మదినిడిన దృశ్యమాలికలు
మధురోహలతో లిఖించిన అదృశ్య వర్నవీచికలు

Wednesday, May 12, 2010

కనులు ముస్తే నీ రూపం

కనులు ముస్తే నీ రూపం తలుచు కుంటే అపురూపం,
కళల లోనే నీ కొలవు దరిచేరేది ఎన్నాళ్ళకు...??